Actress Kasthuri | నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్..! ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
Actress Kasthur | నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
Actress Kasthuri | నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం మాది తమిళ జాతి అంటుంటే.. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై మండిపడ్డారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కస్తూరి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను తెలుగువారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లోని తెలుగు సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కస్తూరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో విచారించేందుకు సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఫోన్ చేయడంతో స్విచ్ఛాప్ ఉండడంతో పరారీలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తిరస్కరించింది. కస్తూరి గతంలోనూ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆమె తాను నటించిన సినిమాల కన్నా.. ఏదో అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతూ ఉంటాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

