అంచనాలు నిజమయ్యాయి
‘అందరూ కొత్తవాళ్లు కలిసి చేసిన ప్రయత్నమిది. తప్పకుండా ప్రేక్షకులు ఇష్టపడతారనే నమ్మకంతో ప్రమోట్ చేశాం. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. దాంతో ఈ తరహా సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది’ అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. నార్నే నితిన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘అందరూ కొత్తవాళ్లు కలిసి చేసిన ప్రయత్నమిది. తప్పకుండా ప్రేక్షకులు ఇష్టపడతారనే నమ్మకంతో ప్రమోట్ చేశాం. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. దాంతో ఈ తరహా సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది’ అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. నార్నే నితిన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని హారిక సూర్యదేవర నిర్మించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో రాబోవు రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నాం. అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి’ అన్నారు. తన తొలి చిత్రానికే ఈ స్థాయి స్పందన రావడం ఆనందంగా ఉందని దర్శకుడు కల్యాణ్ శంకర్ అన్నారు. సినిమా బాగా ఆడుతుందని ముందే ఊహించామని, ఆసాంతం చక్కటి వినోదంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నదని హీరోలు నార్నే నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్ ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

