మహేశ్ బాబు (Mahesh babu), కీర్తిసురేశ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేస్తున్నారు.
తాజాగా ‘మ మ మహేశా’ సాంగ్ ప్రోమో (Ma Ma Mahesha Promo) వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందరూ అనుకున్నట్టుగానే శేఖర్ మాస్టర్ మహేశ్ బాబుతో ఇరగదీసే ఊరమాస్ స్టెప్పులేయించాడు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను జోనితా గాంధీ, శ్రీకృష్ణ పాడారు. ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, ఐ రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.