Sita Ramam | ‘సీతారామం’ లెటర్ వీడియో సాంగ్ రిలీజ్.. గ్రాండియర్ విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న పాట
Letter Video Song | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు జపిస్తున్న మంత్రం ‘సీతారామం’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌కు ఊపిరిపోసింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని రుజువు చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి ఈ సినిమాకు విశేష ఆధరణ వస్తుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకొని లాభాల బాట పట్టింది. ఈ మూవీతో దుల్కర్‌కు టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమా విజయంలో విశాల్ చంద్రశేఖర్ సంగీతం కీలకపాత్ర వహించింది. విశాల్ స్వర పరిచిన పాటలు విడుదలకు ముందు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కాగా తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని లెటర్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
‘ఎప్పుడో నిన్ను చూసే రోజు’ అంటూ సాగే మెలోడీయస్ గీతాన్ని యాజిన్ నిజర్ ఆలపించాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. గ్రాండియర్ విజువల్స్, కాశ్మీర్ అందాలు అలరిస్తున్నాయి. దుల్కర్ హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. కాశ్మీరి ముస్లిం అమ్మాయిగా రష్మిక నటించగా.. బాలాజీ పాత్రలో తరుణ్ భాస్కర్ నటించాడు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

