Leo Movie Ney Ready Song | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్గా నటిస్తుండగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. లియో కోసం విజయ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ న్యూస్ వచ్చింది.
ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ (Naa Ready) ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ పాటను తెలుగుతో పాటు కన్నడ, మలయాళం హిందీ వెర్షన్లో నేడు సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. విష్ణు ఎడవన్ రాసిన ఈ ట్రాక్‌ను తమిళంలో దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడగా.. తెలుగులో ఈ పాటను రేవంత్ చేత పాడించారు. రఘురామ్ సాహిత్యం అందించాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.