Lenin | అక్కినేని అఖిల్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మాస్ కంబ్యాక్ మూవీ ‘లెనిన్’ ఇప్పుడు ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన అప్డేట్ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. చిత్ర బృందం ‘లెనిన్’ థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 30న విశాఖపట్నంలో గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్ణయించింది. సాయంత్రం 4 గంటలకు నగరంలోని ప్రముఖ శరత్ థియేటర్లో ఈ ఈవెంట్ జరగనుంది. ట్రైలర్ లాంచ్ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖిల్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్లో అఖిల్ పూర్తిస్థాయి రస్టిక్ లుక్‌లో సైకిల్ తొక్కుతూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. డస్ట్‌తో నిండిన గ్రామీణ వాతావరణంలో ఊరమాస్ అవతార్‌లో దర్శనమిచ్చిన అఖిల్, తన కెరీర్లో ఇప్పటివరకు కనిపించని కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్‌కు కీలకంగా మారనుంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈసారి పూర్తిస్థాయి మాస్ యాక్షన్ కథను ఎంచుకోవడం విశేషం. గ్రామీణ నేపథ్యం, ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో అఖిల్ సరసన యువ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘లెనిన్’ చిత్రం అఖిల్ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమాగా భావిస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.