Lawrence | విజయ్ పార్టీ నుంచి రాఘవ లారెన్స్ పోటీ..? తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై తమిళ రాజకీయాల్లో జోరుగా ప్రచారం!
Lawrence | తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఇప్పుడు కీలక ఉపఎన్నికకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
Lawrence | తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఇప్పుడు కీలక ఉపఎన్నికకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవడానికి టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో టీవీకే అభ్యర్థిగా లారెన్స్‌ను బరిలోకి దించే ఆలోచన పార్టీ అధిష్ఠానం చేస్తున్నట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రజల్లో మంచి గుర్తింపు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న ఆదరణ, యువతలో ఉన్న ఫాలోయింగ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని లారెన్స్‌ను ఎంపిక చేయాలని పార్టీ భావిస్తోందని సమాచారం. లారెన్స్ లాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి బరిలో ఉంటే తిరుచ్చి ఈస్ట్‌లో టీవీకే విజయం మరింత సులభమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఈ స్థానం నుంచి స్టార్ హీరోయిన్ త్రిష పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవడంతో ఆ వార్తలకు తెరపడింది. రాఘవ లారెన్స్‌కు విజయ్ రాజకీయ ప్రయాణంపై ఎప్పటి నుంచో సానుకూల అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించినప్పుడు కూడా లారెన్స్ సోషల్ మీడియా ద్వారా విజయ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల విషయంలో కూడా ఆయన విజయ్‌కు మద్దతుగా నిలిచారు. అయితే రాజకీయ రంగప్రవేశంపై రాఘవ లారెన్స్ ఇప్పటికే తన గురువు, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చర్చించినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో అడుగుపెట్టే అంశంపై రజనీకాంత్ సలహా, సూచనలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

