ఆశిష్‌గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీరేష్ గాజుల నిర్మిస్తున్నారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సినిమా థీమ్ వైవిధ్యంగా ఉందన్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘అలనాటి కృష్ణార్జునులు స్నేహితులైతే ఎలా ఉంటారో తెలిపే చిత్రమిది. కథ, కథనాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. స్నేహం గొప్పతనాన్ని ఈ తరం వారికి తెలియజెప్పేలా ఈ సినిమా కథ ఉంటుందని హీరో ఆశిష్‌గాంధీ పేర్కొన్నారు.