కత్తి మహేష్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్.. వైద్యులు ఏమంటున్నారంటే..!

ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు కత్తి మహేష్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో చాలా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉంది అంటూ నెల్లూరు వైద్యులు చెప్పారు. జూన్ 26 ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు, చెన్నై హైవేలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు మహేష్ కత్తి. ఆ తర్వాత ఈయనను మెరుగైన వైద్యం కోసం చెన్నై మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అనే విషయంపై ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన పరిస్థితి విషమించింది.. పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. మహేష్ ఆరోగ్యం చేయి దాటిపోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనను అభిమానించే వాళ్ళు, అలాగే ఆయనంటే పడని వాళ్ళు కూడా మహేష్ కత్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సమయంలో అతడి స్నేహితుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. అది చూసిన తర్వాత మహేష్ కత్తి ప్రస్తుతం ఎలా ఉన్నాడు అనేది అర్థమైపోతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం కత్తి మహేష్ కు ప్రాణాపాయం తప్పింది.. అయితే గాయాలు మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
వీటికి సర్జరీ జరుగుతుంది. కన్ను దగ్గర గాయం చాలా తీవ్రంగా ఉండడంతో వైద్యులు దీనిపైనే ఎక్కువగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దు.. మేము వైద్యులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం.. బ్రెయిన్ కూడా బాగానే పనిచేస్తుంది.. ఎలాంటి సమస్యలు లేవు.. వైద్యానికి ఆయన బాగానే స్పందిస్తున్నాడు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు అంటూ కత్తి మహేష్ స్నేహితుడు వెంకట సిద్ధారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Health
- kathi mahesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

