ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న లహరి రోడ్డు యాక్సిడెంట్ కు పాల్పడింది. శంషాబాద్ లో రాత్రి షూటింగ్ ముగించుకొని తన కారులో ఇంటికి బయల్దేరింది లహరి. దారిలో ఓ బైక్ ను తప్పించబోయి ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్ ను నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అతడ్ని హుటాహుటిన దగ్గర్లోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రమాదం తర్వాత కారు చుట్టూ గుమిగూడిన జనాల్ని చూసి భయపడిన లహరి, కిందికి దిగలేదు. దాంతో పోలీసులు, ఆమెను కారులోనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. లహరి మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం సేవించలేదని తేలింది. లహరి పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది.