Ram Gopal Varma | బ్రూస్ లీ ఇలాఖాలో ‘లడ్ కీ’ ప్రీమియర్..ఆర్జీవీ ట్వీట్
మోడల్, మార్షల్ ఆర్టిస్ట్, నటి పూజా భలేకర్ (Pooja Bhalekar) టైటిల్ రోల్ చేస్తోన్న చిత్రం లడ్కీ..ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki Enter The Girl Dragon). జులై 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది
టాలీవుడ్ (Tollywood) దర్శకుడు రాంగోపాల్ వర్మ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెకిస్తున్న చిత్రం లడ్కీ..ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki Enter The Girl Dragon). మోడల్, మార్షల్ ఆర్టిస్ట్, నటి పూజా భలేకర్ (Pooja Bhalekar) టైటిల్ రోల్ చేస్తోంది. ఆర్జీవీ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టార్ హీరో బ్రూస్ లీ లీడ్ రోల్ చేసిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో తెరకెక్కించాడు. జులై 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. బ్రూస్ లీ స్ఫూర్తిగా సాగే యువతి పాత్రలో కనిపించనుంది పూజా భలేకర్.
కాగా చైనాలో ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు. థియేటర్లో ఆడియెన్స్ సినిమా వీక్షిస్తున్నపుడు తీసిన స్టిల్‌ను ఆర్జీవీ (Ram Gopal Varma)ట్విటర్లో షేర్ చేశాడు. చైనాలోని ఫోషన్ సిటీ థియేటర్లో ప్రేక్షకులు లడ్ కీ ప్రీమియర్ షోలో పూజా భలేకర్ చేస్తున్న మార్షల్ ఆర్ట్స్‌ను చూస్తున్నారు. ఆసక్తికర విషయమేంటంటే బ్రూస్ లీ స్వస్థలం కూడా ఫోషన్ సిటీనే కావడం..అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు రాంగోపాల్ వర్మ.
తెలుగు, హిందీ, చైనీస్ తోపాటు పలు భాషల్లో విడుదల కానుంది లడ్ కీ. ఈ మూవీని ఇండో-చైనీస్ కో ప్రొడక్షన్ బ్యానర్లో ఆర్ట్సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. లడ్ కీ ఇండియాలోనే మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమా కావడం విశేషం.
Chinese audience watching @PoojaBofficial doing martial arts at a premiere show of LADKI in Foshan city, China ..Incidentally Foshan is the native place of BRUCE LEE pic.twitter.com/cPct90Yw0O
— Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

