మూవీ లవర్స్ అభిరుచులకు అనుగుణంగా లవ్, ఫ్యామిలీ, యాక్షన్..ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు విశాల్ (Vishal). ఈ హీరో సినిమాలు కొన్ని బాక్సాపీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తే..మరికొన్ని డీలా పడ్డాయి. కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న విశాల్ ఇపుడు కొత్త సినిమాతో అందరినీ పలుకరించబోతున్నాడు. ఏ వినోథ్ కుమార్ (A Vinoth Kumar) డైరెక్షన్లో విశాల్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా లాఠీ (Laatti). ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌ను మేకర్స్ అందించారు.
లాఠీ ఫస్ట్ లుక్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. రానా ప్రొడక్షన్స్ బ్యానర్లో రమణ, నంధా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ కొనసాగుతోంది. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ (Peter Hein master) మాస్టర్ నేతృత్వంలో ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఖాకీ యూనిఫాంలో ఉన్న విశాల్ కత్తిపోట్లతో చేతిలో లాఠీ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఎదురుగా అపార్టుమెంట్ ఉండగా..విశాల్‌పై లేజర్ కిరణాలు పడుతుండటం పోస్టర్లో చూడొచ్చు.
ఈ మూవీలో నాగ్‌పూర్ భామ సునైన యెల్లా (Sunaina Yella) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. లాఠీలో ప్రేక్షకులను రక్తికట్టించే యాక్షన్ సన్నివేశాలుండబోతున్నాయని డైరెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చెప్పేస్తున్నాడు. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.