Laal Singh Chaddha | అమీర్‌ఖాన్ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫాం ఫైనల్..!
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) ఆగస్టు 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అప్ డేట్ బయటకు వచ్చింది.
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir khan) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సమర్పిస్తున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అప్ డేట్ బయటకు వచ్చింది.
పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం Netflix సొంతం చేసుకుందట. దీనికోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంలో ఖర్చు పెట్టిందట. అంటే కొన్ని వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్ లో సందడి చేయనుందన్నమాట. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ ప్రాజెక్టు ఫారెస్ట్ గంప్‌కు రీమేక్ గా వస్తుంది.
టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అందాల భామ కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అమీర్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

