ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమా రీమేక్‌గా దర్శకుడు అద్వైత చందన్ తెరకెక్కిస్తున్నారు. కరీనా కపూర్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు నాగచైతన్య. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇటీవల ‘కహానీ..’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాట గురించి తాజాగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ…‘సినిమాలోని విజువల్స్‌తో అవసరం లేకుండా ఈ పాటను ఆస్వాదించవచ్చు. అంత మంచి పాట. మా సినిమాకు ఈ పాట ఒక ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఈ సినిమా రీమేక్ సన్నాహాలు మొదలై షూటింగ్ పూర్తి చేసేందుకు మాకు 14 ఏండ్లు సమయం పట్టింది. కొన్నేళ్లు సినిమా రీమేక్ హక్కుల కోసమే వెచ్చించాం. ఇప్పటికి సినిమా పూర్తయింది’ అన్నారు.