Kubera | ‘కుబేర’ అనే పేరుకి తగ్గట్టుగా, కంటైనర్ నిండా నోట్ల కట్టలు. దాని ఎదురుగా వర్షంలో గొడుగుతో నాగార్జున. ఫస్ట్‌లుక్‌లోనే సినిమాపై, అందులోని నాగార్జున పాత్రపై ఆసక్తి రేకెత్తేలా చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ లుక్‌లో నాగ్ ైస్టెలిష్‌గా, కాస్త ఏజ్డ్గా కనిపిస్తున్నారు. ‘కుబేర’ అన్న టైటిల్‌కి సరిగ్గా సరిపోయేలా ఉంది నాగ్ స్టిల్. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జునది ప్రత్యేక పాత్ర అని గతంలో వార్తలొచ్చాయి.
కానీ ఈ ఫస్ట్‌లుక్ చూస్తుంటే టైటిల్‌రోల్ నాగార్జునే చేసినట్టు అనిపిస్తున్నది. ఏదేమైనా నాగార్జున లుక్ మాత్రం ఆయన అభిమానులు మెచ్చేలా ఉందని చెప్పక తప్పదు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు.