నాగార్జున నిర్ణయం నాలో స్ఫూర్తిని నింపింది
‘నటుడిగా పరిథిని పెంచుకోవాలని రొటీన్‌కి భిన్నంగా నాగార్జున చేసిన ఈ ప్రయత్నం నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా తర్వాత నిజంగా ఆయన కోసం పాత్రలు పుడతాయ్. ఈ విషయంలో నాక్కూడా ప్రేరణగా నిలిచారాయన. ధనుష్ నిజంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఈ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఈ సినిమాతో తప్పకుండా ధనుష్‌కు నేషనల్ అవార్డు రావాలి.
‘నటుడిగా పరిథిని పెంచుకోవాలని రొటీన్‌కి భిన్నంగా నాగార్జున చేసిన ఈ ప్రయత్నం నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా తర్వాత నిజంగా ఆయన కోసం పాత్రలు పుడతాయ్. ఈ విషయంలో నాక్కూడా ప్రేరణగా నిలిచారాయన. ధనుష్ నిజంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఈ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఈ సినిమాతో తప్పకుండా ధనుష్‌కు నేషనల్ అవార్డు రావాలి. శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు తక్కువే అయినా.. అన్నీ ఆణిముత్యాలే. ఆయన సినిమాల్లో ఆర్టిస్టులు కనిపించరు. పాత్రలే కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఈ సినిమా మరింత విజయాన్ని సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలి’ అని చిరంజీవి ఆకాంక్షించారు. ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా కథానాయిక.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, రామ్మోహన్ పుస్కూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు. ‘థ్రిల్లర్ తీసి సోషల్ మెసేజ్ ఇవ్వడం శేఖర్ కమ్ములకే చెల్లింది. నటుడిగా నాలో మార్పు తెచ్చిందీ సినిమా. ఇక వెరైటీ పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇంకో 40ఏండ్లు నటుడిగా కొనసాగే స్ఫూర్తినిచ్చిందీ సినిమా. ఇక ధనుష్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ సినిమా అందరికీ నచ్చడం అరుదు. అందుకే ‘కుబేర’ ఓ మిరాకిల్.’ అని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ధనుష్ మాట్లాడుతూ ‘భారీతనం కాదు.. భావోద్వేగాలే ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పిస్తాయని నిరూపించిన సినిమా ‘కుబేర’.’ అన్నారు. ‘ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాను. ఫస్ట్ షోతోనే ఆ కష్టాన్నంత మరిచిపోయేంత ఆనందాన్ని ఆడియన్స్ నాకిచ్చారు.’ అని శేఖర్‌కమ్ముల సంతోషం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

