ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్‌గా ప్రసిద్ధి పొందాయి ‘క్రిష్’ చిత్రాలు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు తెరకెక్కగా..ఇప్పుడు నాలుగో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. కథా రచనను ముగించే దశకు దర్శకుడు రాకేష్ రోషన్ చేరినట్లు తెలుస్తున్నది. కథ లాక్ అవగానే సినిమా సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. 2013లో ‘క్రిష్ 3’ సినిమా విడుదలైంది.
ఈ కథ ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే ‘క్రిష్ 4’ సినిమా ప్రారంభం కాబోతున్నదట. హృతిక్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో ఇతర చిత్రబృందం ఎవరనేది త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మితం కానుందని, సినిమాలోని యాక్షన్ సీక్వెన్సులు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.
హీరో హీరోయిన్లకు ఓ బిడ్డ పుట్టడం అతనికి రోహిత్ అనే పేరు పెట్టడంతో ‘క్రిష్ 3’ సినిమా ముగుస్తుంది. ఇక్కడి నుంచి కొత్త కథను తెరకెక్కించబోతున్నారు. ఇటీవల సరైన విజయాలు లేని హృతిక్‌కు ఈ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నారు.