యాక్షన్‌తో మెప్పిస్తుందట
ఈ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటిస్తూ సాటి తారలను ఆశ్చర్యపరుస్తున్నది బాలీవుడ్ భామ కృతి సనన్. ఇటీవలే అక్షయ్ కుమార్‌తో కలిసి ‘బచ్చన్ పాండే’ సినిమాతో తెరపైకి వచ్చిందీ నాయిక.
ఈ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటిస్తూ సాటి తారలను ఆశ్చర్యపరుస్తున్నది బాలీవుడ్ భామ కృతి సనన్. ఇటీవలే అక్షయ్ కుమార్‌తో కలిసి ‘బచ్చన్ పాండే’ సినిమాతో తెరపైకి వచ్చిందీ నాయిక. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘షెహజాదా’ నవంబర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నది. ఈ సినిమా కీలక షెడ్యూల్ ఇటీవలే మారిషస్‌లో పూర్తి చేసుకుంది. విదేశాల నుంచి తిరిగి ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే ‘గణపథ్’ సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలో టైగర్ ష్రాప్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ కోసం లఢక్ వెళ్తున్నారు చిత్రబృందం. మండే ఎండల్లో లఢక్ చల్లని వాతావరణంలో షూటింగ్ చేయబోతున్నారు. టైగర్ ష్రాప్‌కు యాక్షన్ హీరోగా పేరుంది. అయితే ఈ సినిమాలో హీరోతో పాటు కృతి కూడా అదిరిపోయే స్టంట్స్ చేయనుంది. ఇందుకోసం షావోలిన్ పోరాట విద్యలను నేర్చుకుంటున్నది కృతి. ఆమెకు ఈ స్టంట్స్ నేర్పిస్తున్న మాస్టర్ హర్ష్ వర్మ కృతి టాలెంట్ చూసి సంతోషపడుతున్నాడు. కృతి చెప్పేది బాగా విని, త్వరగా నేర్చుకుంటుందని. సహజంగా కష్టమైన షావోలిన్ ఫైట్స్‌ను కృతి తక్కువ సమయంలో పర్ఫెక్ట్గా నేర్చుకుందని ఆయన చెబుతున్నారు. స్టంట్ మాస్టర్ మాటలతో శృతి కలిపిన ‘గణపథ్’ టీమ్ తమ సినిమా రిలీజ్ తర్వాత కృతి సనన్‌ను యాక్షన్ క్వీన్ అని పిలుస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నాయిక ప్రభాస్ హీరోగా ‘ఆది పురుష్’, హారర్ డ్రామా ‘బేడియా’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

