Rangamarthanda | కృష్ణవంశీ రంగమార్తాండ విడుదలయ్యేది అప్పుడే..!
డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ రంగమార్తాండ (Rangamarthanda). ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ రంగమార్తాండ (Rangamarthanda). మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన నట సామ్రాట్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. రంగమార్తాండను మార్చి 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. అంటే కేవలం 12 రోజులే ఉంది.
అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రంగమార్తాండ తాజా విడుదల తేదీ గాసిప్‌గానే మిగిలిపోనుందా..? లేదంటే విడుదల తేదీపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారా..? అన్నది చూడాలంటున్నారు సినీ జనాలు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీని హౌస్‌ఫుల్ మూవీస్-రాజ శ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రంగమార్తాండకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. కృష్ణవంశీ కాంపౌండ్ నుంచి ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అలీ రెజా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రంగమార్తాండ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) షాయరీ (కవితాఝరి) అందించిన విషయం తెలిసిందే. 2017లో సాయిధరమ్ తేజ్‌తో నక్షత్రం సినిమా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్లీ చాలా కాలం తర్వాత రంగమార్తాండ సినిమాతో తనలోని క్రియేటివిటీని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు కృష్ణవంశీ.
Read Also :
Sunny Leone | సన్నీలియోన్ ఇంతకీ ఎక్కడికెళ్లిందో.. ట్రెండింగ్‌లో వీడియో
Dasara | దసరా నుంచి Mainaru VettiKatti సాంగ్‌కు నాని డ్యాన్స్
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

