కోల్కతా: చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్కు (Zareen Khan) కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. కోల్కతాలోని నార్కెల్దంగా (Narkeldanga) పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసులో రూ.30 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరుచేస్తూ (Interim Bail) సీల్దా కోర్టు (Sealdah court) తీర్పునిచ్చింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
2018లో కోల్కతాలో జరిగిన దూర్గా పూజలో (Durga Puja) పాల్గొనేందుకు నిర్వహాకుల నుంచి జరీన్ ఖాన్ రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకుంది. అయితే ఆ కార్యక్రమానికి రాకపోవడంతో జరీన్తోపాటు ఆమె మేనేజరుపై నార్కెల్దంగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్లో జరీన్ ఖాన్కు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.