దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ‘క’ నామినేట్
నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ఈ సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్ర విభాగానికి ‘క’ నామినేట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరిగే వేడుకల్లో విజేతలు పురస్కారాలు అందుకోనున్నారు.
నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ఈ సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్ర విభాగానికి ‘క’ నామినేట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరిగే వేడుకల్లో విజేతలు పురస్కారాలు అందుకోనున్నారు. నూతన దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నయన్ సారిక, తన్వీ రామ్ ఇందులో కథానాయికలు. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. ఇదో విభిన్నమైన కథ. కర్మసిద్ధాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సగటు ప్రేక్షకునికి ఆద్యంతం సినిమా చూస్తే తప్ప అంతుచిక్కని స్క్రీన్‌ప్లేతో దర్శకులు సుజిత్, సందీప్ ‘క’ను మలిచారు. వాణిజ్య పరంగా 50కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీనికి కొనసాగింపు కూడా ఉంటుందని, తొలి పార్ట్‌ని మించేలా ‘క -2’ తెరకెక్కిస్తామని దర్శకులు చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

