Akkineni Nagarjuna | టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). క్లాస్, మాస్..కామెడీ..యాక్షన్.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని కింగ్ నాగార్జునగా మారాడు. ఆగస్టు 29న నాగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులను ఖుషీ చేసే అప్డేట్ అందించారు మేకర్స్.
నాగార్జున ఈ ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని రీతిలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి కొత్త సినిమా ఏది ప్రకటించలేదు. రేపు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ రాబోతుంది. #KingOsthunnadu హ్యాష్‌ట్యాగ్‌తో రేపు ఉదయం 10:27 గంటలకు నాగార్జున కొత్త సినిమా ప్రకటన ఉండబోతుందని తెలియజేస్తూ.. మేకర్స్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.
ఇంటికి దూరంగా సైకిల్, హ్యాండిల్‌పై కత్తి కనిపిస్తున్న లుక్ సినిమా ప్రకటనపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజా టాక్ ప్రకారం పాపులర్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడట. రేపు సినిమా టైటిల్, గ్లింప్స్ వీడియో లాంఛ్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జున ఈ సారి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తున్నాడోనని ఆసక్తిగాఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
𝐊𝐢𝐧𝐠 👑𝐎𝐬𝐭𝐡𝐮𝐧𝐧𝐚𝐝𝐮
Set your ⏲️ Ready For Stellar Update Tomorrow at🔟:2⃣7⃣AM ⭐️🔊#KingOsthunnadu #HBDKingNagarjuna @SS_Screens @srinivasaaoffl pic.twitter.com/8IqGRIu8dc
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 28, 2023