King of Kotha | ఒకరు అర్జున్ రెడ్డితో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. మరొకరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాంటి క్షణం రానే వచ్చింది. ఇంతకీ ఈ ఇద్దరూ ఒక్క చోట చేరేందుకు కారణమేంటో ఇప్పటికే ఊహించి ఉంటారు. ఈ స్టార్ యాక్టర్లు వారం రోజుల వ్యవధిలో తమ తమ సినిమాలతో సందడి చేయబోతున్నారు.
దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న కింగ్ ఆఫ్ కోట (King of Kotha)ఆగస్టు 24న పాన్ ఇండియా స్థాయిలో విడదలవుతుంది. మరోవైపు శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి సెప్టెంబర్ 1న పలు భాషల్లో రిలీజవుతుంది. ఆదివారం రాత్రి కింగ్ ఆఫ్ కోట ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల కానుంది.
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ (Kushi Trailer) ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీనమ్మా కశ్మీర్.. సేమ్ రోజా సినిమాలాగుంది.. అంటూ కశ్మీర్‌కు వచ్చిన విజయ్ దేవరకొండ అంటున్న సంభాషణలతో ట్రైలర్ షురూ అవగా.. అక్కడ లోకల్ అమ్మాయి బేగం (సామ్)ప్రేమలో పడటం.. ఆ తర్వాత తాను బేగం కాదు బ్రాహ్మిణ్ అంటూ సామ్ చెప్పడం, ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ నడిచిందనేది కొంచెం సస్పెన్స్‌లో పెడుతూ ఫన్, రొమాంటిక్ టచ్‌తో సాగుతూ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఖుషి ట్రైలర్..
రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే సంభాషణలతో మొదలైన కింగ్ ఆఫ్ కోట టీజర్లో తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
కింగ్ ఆఫ్ కోట టీజర్..