స్వీయ దర్శకత్వంలో నటిస్తూ.. పద్మనాభరెడ్డితో కలిసి పూర్వాజ్ నిర్మించిన ఉమెన్ సెంట్రిక్ స్పై థ్రిల్లర్ ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్ కథానాయిక. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఆదివారం హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సూపర్, మిస్టీరియస్ ఉమెన్‌గా కనిపిస్తున్న జ్యోతి పూర్వాజ్ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
ఇందులో జ్యోతి పూర్వాజ్ సూపర్ షీగా కనిపించనున్నదని, ఓ వినూత్న ప్రపంచాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: అశీర్వాద్, సుమన్ జీవ, సమర్పణ: ఉర్వీజ్ పూర్వాజ్.