Khudiram Bose | ఇండియన్ పనోరమ కోసం ఎపిక్ సాగా ‘ఖుదీరామ్ బోస్’ ఎంపిక
Khudiram Bose | ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 53వ ఎడిషన్‌లో ప్రదర్శించడానికి తెలుగు చిత్రం 'ఖుదీరామ్ బోస్' ఎంపికైనట్లు నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి, డీవీఎస్ రాజు సంతోషంగా ప్రకటించారు.
Khudiram Bose | భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్య్ర సమర యోధుడు ఖుదీరామ్ బోస్. ఆయన 1889లో జన్మించాడు. ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి 1908లో మరణశిక్ష విధించబడ్డాడు. ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర గురించి చరిత్రను అనుసరించే విద్యార్థులకు బాగా తెలుసు. ఖుదీరామ్ బోస్పై తీస్తున్న పాన్-ఇండియా బయోపిక్ అత్యంత ఆశాజానకమైన చిత్రాలలో ఒకటి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 53వ ఎడిషన్‌లో ప్రదర్శించడానికి తెలుగు చిత్రం ‘ఖుదీరామ్ బోస్’ ఎంపికైనట్లు నూతన నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి మరియు డీవీఎస్ రాజు సంతోషంగా ప్రకటించారు.
ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్ లో ఒకటైన ఇండియా ఇండియన్ పనోరమా – ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI).. శనివారం 25 ఫీచర్ ఫిలింస్, 20 నాన్ ఫీచర్ ఫిలింస్‌ను ఎంపిక చేసింది. ఇందులో ఫీచర్స్ ఫిలింస్ విభాగంలో ఖుదీరామ్ బోస్ ఎంపికైంది. ఎంపిక చేసిన చిత్రాలు 2022 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 53వ IFFIలో ప్రదర్శించబడతాయి.
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీ నటులుగా ప్రతిభావంతులైన విజయ్ జాగర్ల మూడి, డి. వి. యస్. రాజుల దర్శకత్వంలో రజిత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్య్ర సమర యోధుడు బయోపిక్ చిత్రం “ఖుదీరామ్ బోస్”. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది.ఇందులో రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటనను కనబరచారు. సంగీత దర్శకుడు మణిశర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నన్ మరియు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మరియు డైలాగ్ రైటర్ బాలాదిత్య ఇలా ఈ చిత్రానికి పని చేశారు
నటీనటులు : రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు.
బ్యానర్: గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్, నిర్మాత: రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు: విజయ్ జాగర్లమూడి, డీవీఎస్ రాజు, DOP: రసూల్ ఎల్లోర్, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, సంగీత దర్శకుడు: మణి శర్మ, స్టంట్ డైరెక్టర్: కనల్ కన్నన్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
Read More :
Anudeep KV Interview | ‘ప్రిన్స్’ కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది: అనుదీప్ కెవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- IFFI
- Khudiram Bose
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

