‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ కన్నడంలో నటించిన ఓ చిత్రాన్ని ‘రారాజు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత వీఎస్ సుబ్బారావు. మహేష్రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో యష్ సరసన రాధికా పండిట్ నాయికగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్ను ఇటీవల దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు.
కన్నడంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుందని నిర్మాత తెలిపారు. ‘కిక్’ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హరికృష్ణ