Prashanth Neel | అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన హారర్ సినిమా ’418’ సెన్సార్ బోర్డు అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో హారర్ సీన్లు ఎక్కువగా ఉన్నాయంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం తెలపడంతో, మేకర్స్ రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. కిర్తన్ నాడగౌడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31నే విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కిర్తన్ నాడగౌడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నాడు. అయితే ఒక హారర్ చిత్రంలో హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడం పట్ల నెటిజన్లు సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. ‘హారర్ సినిమాలో హారర్ సీన్లు కాక ఇంకేముంటాయి?’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.