K.G.F Chapter-2 | ‘కేజిఎఫ్ చాప్టర్-2’.. రాఖీ భాయ్ ది మామూలు దండయాత్ర కాదు..!
ఒక కన్నడ డబ్బింగ్ సినిమా మన దగ్గర విడుదల అయితే ఇంత హంగామా చేయడం చరిత్రలో ఇప్పటి వరకు చూడలేదు. కానీ కేజిఎఫ్ చాప్టర్-2 విషయంలో ఇది జరిగింది. మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
K.G.F Chapter-2 | ఒక కన్నడ డబ్బింగ్ సినిమా మన దగ్గర విడుదల అయితే ఇంత హంగామా చేయడం చరిత్రలో ఇప్పటి వరకు చూడలేదు. కానీ కేజిఎఫ్ చాప్టర్-2 విషయంలో ఇది జరిగింది. మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 4 సంవత్సరాల తర్వాత విడుదలైన సీక్వెల్ తో అదే రచ్చ కొనసాగిస్తూ థియేటర్లో దండయాత్ర మొదలు పెట్టాడు రాఖీ భాయ్. ఇంకా అప్పుడు యశ్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.. కానీ ఇప్పుడు అతడు బ్రాండ్ అయిపోయాడు. కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. రాఖీ భాయ్ దండయాత్ర ఇప్పుడు ఇండియా సినిమా ఇండస్ట్రీపై జరుగుతుంది. తన రాకను గంభీరంగా అనౌన్స్ చేశాడు రాఖి. దేశవ్యాప్తంగా థియేటర్స్ లో కేజిఎఫ్ చాప్టర్ 2కి వస్తున్న రెస్పాన్స్ చూసాక కన్నడ సినిమా రేంజ్ ఏంటనేది అందరికీ అర్థమవుతుంది.
మూడేళ్ల కింది వరకు కన్నడ నుంచి సినిమా వస్తుంది అంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కాని దేశం మొత్తం వాళ్ళ వైపు తిరిగి చూసేలా చేశారు కేజిఎఫ్ యూనిట్. మొదటి భాగం సృష్టించిన సంచలనాల కంటే రెండో భాగం మరింత ఎక్కువగా రావడం ఖాయమైపోయింది. మరీ ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చాప్టర్ 2 ఇండియాలో చాలా రికార్డ్స్ తిరగరాసేలా కనిపిస్తోంది. తెలుగులో ఎవరూ ఊహించని విధంగా ఓపెనింగ్స్ రాబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే కన్నడ కంటే ఎక్కువగా తెలుగులోనే రికార్డు ఓపెనింగ్స్ వస్తున్నాయి.
హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా కేజిఎఫ్ 2 రికార్డు ఓపెనింగ్స్ తీసుకురావడం ఖాయమైపోయింది. ఎలా చూసుకున్నా కూడా కేజిఎఫ్ రెండో భాగం చేసే రీ సౌండ్ కు రికార్డులు బద్దలు అయిపోవడం ఖాయం. మొదటి భాగం బడ్జెట్ సమస్యలతో కాస్త లిమిటేషన్స్ తో తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. సెకండ్ పార్ట్ మాత్రం భారీ బడ్జెట్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ తో చిత్రీకరించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

