Kgf Chapter-2 OTT | కన్నడ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘కేజీఎఫ్’. 2018లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. దీనిక కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 తెరకెక్కింది. ఎప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం వసూళ్ళ సునామీని సృష్టించింది. ఖాన్, కపూర్లను సైతం వెనక్కినెట్టి రాఖీబాయ్ టాప్‌ప్లేస్‌లో నిలిచాడు. బాలీవుడ్లో రూ.400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ‘బాహుబలి’ తర్వాత రూ.400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన సినిమాగా కేజీఎఫ్-2 రికార్డు సృష్టించింది. ఇటీవలే ఈ చిత్రం 1200కోట్ల అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
‘కేజీఎఫ్-2’ డిజిటల్ హక్కులను అమేజాన్ సంస్థ సొంత చేసుకోగా.. మార్చి 16నుంచి ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సబ్స్క్రైబర్లు అదనంగా రూ.199 పెట్టి సినిమా చూసే విధానం అమలులో ఉంది. అయితే త్వరలోనే కేజీఎఫ్ చిత్రానికి ‘పే పర్ వ్యూ’ పద్దతిని తొలిగించనున్నారు. జూన్ 3నుంచి అమేజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు కేజీఎఫ్-2 చిత్రాన్ని ఉచితంగా చూసే వెసులు బాటును అమేజాన్ సంస్థ కల్పించనుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటించాడు. రావురమేష్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు.