KGF Chapter-2 Collections | ‘కేజీఎఫ్ చాప్టర్-2’ మరో రికార్డు.. ఏకంగా 300కోట్ల క్లబ్లో ఎంట్రీ?
KGF Chapter-2 Collections | కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం ‘కేజీఎఫ్’. అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో కేజీఎఫ్ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతి ఏరియాలో వసూళ్ళ సునామీని సృష్టించింది. ప్రశాంత్ నీల్ టేకింగ్, విజన్‌కు సినీప్రముఖులు సైతం జేజేలు కొట్టారు. ఇక యష్ నటన, అభినయానికి ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితంగా ఏప్రిల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్-2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజే 130కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక బాలీవుడ్లో ఖాన్, కపూర్లను వెనక్కినెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. విడుదలైన 2 రోజుల్లోనే ఈ చిత్రం బాలీవుడ్లో బ్రేక్ఈవేన్ను పూర్తి చేసుకుంది.ఇక తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో మరో ఘనతను సాధించింది.
తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో 300కోట్ల క్లబ్లో నిలిచింది. 300కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన 9వ సినిమాగా కేజీఎఫ్-2 రికార్డు సృష్టించింది. అంతేకాకండా బాహుబలి-2 తర్వాత ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రంలో కేజీఎఫ్ చాప్టర్-2 నిలిచింది. ఇటీవలే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రం 800కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని వీక్షించిన బన్నీ, చరణ్‌లు చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై రవి కిరగందూర్ నిర్మించాడు.
₹ 300 CR CLUB & ITS MEMBERS…
⭐ 2014: #PK
⭐ 2015: #BajrangiBhaijaan
⭐ 2016: #Sultan
⭐ 2016: #Dangal
⭐ 2017: #TigerZindaHai
⭐ 2018: #Padmaavat
⭐ 2018: #Sanju
⭐ 2019: #War
⭐ 2022: #KGF2
🔥🔥🔥 #Baahubali2 [2017] is the *ONLY* film in ₹ 500 cr Club.#India biz. #Hindi pic.twitter.com/B7NpXPcE8q— taran adarsh (@taran_adarsh) April 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

