Kesariya Song | బ్యూటిఫుల్ ‘కేసరియా’ మెలోడీ లవ్ ట్రాక్ వచ్చేసింది..
అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) డైరెక్ట్ చేస్తున్న బ్రహ్మాస్త్ర (Brahmastra) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను సాంగ్ రూపంలో అందించారు. కేసరియా థేరా (Kesariya Song) వీడియో ట్రాక్‌ను రిలీజ్ చేశారు.
బాలీవుడ్ (Bollywood) నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి బ్రహ్మాస్త్ర (Brahmastra). మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) డైరెక్ట్ చేస్తున్నాడు. రణ్ బీర్ కపూర్, అలియాభట్ (Alia bhatt)తోపాటు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan),అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), మౌనీరాయ్ కీ రోల్స్ చేస్తున్నారు. కాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను సాంగ్ రూపంలో అందించారు. కేసరియా థేరా (Kesariya Song) వీడియో ట్రాక్‌ను రిలీజ్ చేశారు.
ముజ్ కో ఇత్నా బథాయే కోయీ..కైసే తుజ్ సే దిల్ నే లదాయే కోయీ..కేసరియా థేరా అంటూ సాగుతున్న మెలోడీ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. లవ్ బర్డ్స్ రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor)-అలియా లవ్ ట్రాక్‌తో సాగే ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువడం ఖాయమని తాజా వీడియో ట్రాక్ చెబుతోంది.
రియల్ లైఫ్‌లో కూడా ప్రేమాయణం సాగించిన రణ్‌బీర్-అలియా ఈ ఏడాది రియల్ లైఫ్ కపుల్‌గా మారిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత ఈ సాంగ్ రావడంతో ఓ వైపు ఫ్యామిలీ ఆడియెన్స్, మరోవైపు అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాస్త్ర మూడు పార్టులుగా రాబోతుంది. ఫస్ట్ పార్టు సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

