Keerthy Suresh | కీర్తి సురేష్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. డబ్బింగ్ వీడియో వైరల్
Dasara Movie | ప్రస్తుతం ఎక్కడ చూసిన దసరా హవానే కనిపిస్తుంది. సినిమా వచ్చి పది రోజలు దాటిన దీని జోరు తగ్గడం లేదు. తొలిసారి నాని అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్లో కనిపించడంతో ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. డెబ్యూటెంట్‌గా శ్రీకాంత్ ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే తన ప్రతిభ ఏ స్థాయిదో అర్ధమవుతుంది.
Dasara Movie | ప్రస్తుతం ఎక్కడ చూసిన దసరా హవానే కనిపిస్తుంది. సినిమా వచ్చి పది రోజలు దాటిన దీని జోరు తగ్గడం లేదు. తొలిసారి నాని అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్లో కనిపించడంతో ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. డెబ్యూటెంట్‌గా శ్రీకాంత్ ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే తన ప్రతిభ ఏ స్థాయిదో అర్ధమవుతుంది. ఇక మహానటి కీర్తి సురేష్ తన యాక్టింగ్‌తో కూడా కుమ్మేసింది. వెన్నెల పాత్రలో జీవించేసింది. ముఖ్యంగా బరత్‌లో డ్యాన్స్ అయితే ఇరగ్గొట్టేసింది. ఒక్కటా ఇలా చెప్పుకుంటూ పోతే నానికి ఏ మాత్రం తగ్గని రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆఫ్ స్క్రీన్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా తాజాగా కీర్తి దసరా సినిమాలో డిలీటెడ్ సీన్‌కు సంబంధించిన డబ్బింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో కీర్తి తెలంగాణ యాసలో నాన్ స్టాప్ డైలాగ్‌ను ఎలాంటి ఇబ్బంది పడకుండా చెప్పడం అందరిచేత చప్పట్లు కొట్టిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక రెండు వారాల క్రితం భారీ అంచనాలతో రిలీజై ఈ సినిమా తొలిరోజు నుంచే వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.110 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తాజాగా ఓవర్సీస్లో 2మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేసింది. ఈ సినిమాతో నానికి మాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

