Keerthy Suresh | రష్మిక బాటలో కీర్తిసురేశ్..ఆ క్రేజీ అప్ డేట్ ఏంటంటే..?
కెరీర్లో ప్రయోగాత్మక చిత్రాలు చేసే స్టార్ హీరోయిన్లు కొద్ది మందే ఉంటారు. అలాంటి జాబితాలో లీడ్ పొజిషన్ లో ఉంటుంది కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఈ భామ స్టారో హీరోయిన్ రష్మిక బాటలో పయనించేందుకు ముస్తాబవుతుందట.

సినీ పరిశ్రమ (Cinema Industry)లో స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లకు కొదవేమీ లేదనే సంగతి తెలిసిందే. కెరీర్లో ప్రయోగాత్మక చిత్రాలు చేసే స్టార్ హీరోయిన్లు మాత్రం కొద్ది మందే ఉంటారు. అలాంటి జాబితాలో లీడ్ పొజిషన్ లో ఉంటుంది కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ (Keerthy Suresh). మహానటి సినిమాతో కోట్లాదిమంది ఫ్యాన్స్ ఖాతాలో వేసుకుంది కీర్తిసురేశ్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తోంది. ఈ భామ స్టారో హీరోయిన్ రష్మిక బాటలో పయనించేందుకు ముస్తాబవుతుందట. ఇంతకీ ఏ విషయంలో అని తెగ ఆలోచిస్తున్నారా..? ఆ విషయంలోకి వెళ్దాం.
గ్లామరస్ పాత్రలతో సినీ లవర్స్ ను కట్టిపడేసిన రష్మిక (rashmika mandanna) ఇటీవలే పుష్ప సినిమాలో మెరిసింది. అయితే ఈ సారి మాత్రం డీగ్లామరైజ్ డ్ పాత్రలో సరికొత్తగా కనిపించి అందరినీ మెప్పించింది. విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. కీర్తిసురేశ్ కూడా డీగ్లామరస్ పాత్రలో కనిపించనుందట. మరి ఏ సినిమా కోసమనే మీ డౌటు. నాని, కీర్తిసురేశ్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు దసరా. నాని, కీర్తిసురేశ్ కెరీర్లోనే ఖరీదైన సినిమాగా రాబోతుంది. తాజాగా ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న అప్ డేట్ ప్రకారం కీర్తిసురేశ్ ఇదివరకెన్నడూ కనిపించని విధంగా డీ గ్లామరస్ రోల్లో కనిపించనుందట.
కీర్తిసురేశ్ మేకోవర్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తడం ఖామయని చర్చ నడుస్తోంది.తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జరిగినే ఇంటెన్స్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయన్ సౌండ్ ట్రాక్ చూస్తుండగా..నవీన్ నూలి ఎడిటర్. మలయాళ హీరో రోషన్ మాథ్యూ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

