Vijay Devarakonda | తను నాకెప్పుడూ స్పెషలే : విజయ్ దేవరకొండ
Vijay Devarakonda | ‘నేను, నాగ్అశ్విన్, తరుణ్‌భాస్కర్, సందీప్‌రెడ్డి వంగా వేరే వేరే చోట పెరిగాం. మా నేపథ్యాలు వేరు. మా నలుగురినీ సినిమా కలిపింది. ‘పెళ్లిచూపులు’ సినిమాతో నన్ను హీరోను చేశాడు తరుణ్‌భాస్కర్. తను నాకెప్పుడూ స్పెషలే’ అన్నారు యువహీరో విజయ్ దేవరకొండ.
Vijay Devarakonda | ‘నేను, నాగ్అశ్విన్, తరుణ్‌భాస్కర్, సందీప్‌రెడ్డి వంగా వేరే వేరే చోట పెరిగాం. మా నేపథ్యాలు వేరు. మా నలుగురినీ సినిమా కలిపింది. ‘పెళ్లిచూపులు’ సినిమాతో నన్ను హీరోను చేశాడు తరుణ్‌భాస్కర్. తను నాకెప్పుడూ స్పెషలే’ అన్నారు యువహీరో విజయ్ దేవరకొండ. తరుణ్‌భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్‌కుమార్ విష్ణు, చైతన్యరావు మదాడి, రాగ్ మయూర్ ప్రధాన పాత్రధారులు. ప్రముఖ హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె.వివేక్ సుదాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మాతలు. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ అతిథిగా విచ్చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ -‘ నాగ్అశ్విన్ ‘ఎవడే సుబ్రమణ్యం’ నిర్మాణ సమయంలో తరుణ్‌భాస్కర్ నాకు పరిచయమయ్యాడు. మేం కలిసి చేసిన పెళ్లిచూపులు సినిమాకు తరుణ్‌కి నేషనల్ అవార్డ్ వచ్చింది. అంత సక్సెస్ తర్వాత తను ఏమైనా చేయొచ్చు. కానీ తను నమ్మిందే చేస్తాడు. నచ్చిన స్క్రిప్ట్‌తోనే వెళ్తాడు. తను పరిశ్రమకు దొరికిన అదృష్టం. తరుణ్భాస్కర్పై నమ్మకంతో చెబుతున్నా. ‘కీడాకోలా’ కచ్చితంగా మంచి మజానిస్తుంది’ అన్నారు. కుర్రాళ్లతో పనిచేయడంవల్ల యంగ్ అనే ఫీలింగ్ వచ్చిందని, నన్ను వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి కామెడీ చేయించాలనే ఆలోచన తరుణ్భాస్కర్లోని కొత్తదనానికి నిదర్శనమని బ్రహ్మానందం అన్నారు. బ్రహ్మానందంగారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తరుణ్‌భాస్కర్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

