Keeda Cola Movie | తరుణ్ భాస్కర్‌తో చేస్తుంటే.. జంధ్యాల గారితో పనిచేసినట్లు ఉంది : బ్రహ్మానందం
Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) చిత్రాల ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా వచ్చాడు.
అయితే ఈవెంట్లో భాగంగా లెజెండరీ కామెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడుతూ.. కీడా కోలాతో తన అనుభవాలు పంచుకున్నాడు.
”నేను ఈ సినిమాలో నటించడానికి ఒకే ఒక కారణం తరుణ్ భాస్కర్. ఎందుకంటే.. తరుణ్ గతంలో తీసిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు చూశాను. అవి నాకు బాగా నచ్చాయి. ఇలాంటి యువ దర్శకులతో నేను కూడా కలిసి పనిచేయాలి అనుకున్నాను. కానీ నేను వెళ్లి సినిమాలో ఛాన్స్ అడగాలంటే నాకు ఈగో అడ్డు వచ్చింది. వాళ్ళే వచ్చి నాకు ఛాన్స్ ఇచ్చి అడిగితే బాగుండు అనుకునేవాడిని. ఇక తరుణ్ కీడా కోలా సినిమాలో నటించమని అడగడానికి నా వద్దకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ టీం నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. జంధ్యాల గారితో నేను సినిమా చేసినప్పుడు ఎంత హాయిగా.. ఎంత అందమైనటువంటి కామెడీ నాకు పండిందో.. కీడా కోలా చేస్తున్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. నాకు జంధ్యాల గారితో కలిసి పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి” అని తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#KeedaaCola Certified by Brahmi ✅ pic.twitter.com/XMlbQuPCP2
— Mahanatiii (@Mahanatiii) October 29, 2023
క్రైం కామెడీ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాను వీజీ సైన్మా బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మిస్తుండగా.. బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్, రాగ్‌మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్లలో సందడి చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

