Katrina Kaif | రీలవ్ ట్రెండ్‌లో పడిపోయిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్
ఇప్పుడంతా రీ-లవ్ ట్రెండే! మళ్లీ మళ్లీ ప్రేమించడం ఏంటని కంగారొద్దు! ఈ రీ-లవ్ సంస్కృతి ఫ్యాషన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నది.
Katrina Kaif | ఇప్పుడంతా రీ-లవ్ ట్రెండే! మళ్లీ మళ్లీ ప్రేమించడం ఏంటని కంగారొద్దు! ఈ రీ-లవ్ సంస్కృతి ఫ్యాషన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నది. ఉపయోగించిన దుస్తులను తిరిగి అమ్మడం, కొనడాన్ని రీ-లవ్‌గా సూత్రీకరించారు ఫ్యాషన్ ప్రియులు. బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ కూడా రీ-లవ్‌లో పడిపోయింది. దుస్తులు, యాక్సెసరీల సంస్థ సరిటోరియాతో కలిసి వినూత్న విధానానికి తన మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కత్రినా నయా ట్రెండ్ గురించి చెప్పిన ముచ్చట్లు ఇవి..
- ఏదైనా షాపింగ్‌కు వెళ్లినప్పుడు మనసుకు నచ్చిన దుస్తులే కొంటాం. కానీ, అవి వేసుకునే సందర్భమే రాకపోవచ్చు. అలాంటి దుస్తులు నా వార్డ్‌రోబ్‌లో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఏం చేయాలో పాలుపోదు. అలాగని పడేయలేం. ‘రీ-లవ్’ కాన్సెప్ట్ నాకు నచ్చింది. దీని ద్వారా, మనం ఉపయోగించని దుస్తులను వేరేవారికి ఇచ్చే అవకాశం ఉంటుంది.
- పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమల్లో ఫ్యాషన్ మూడో స్థానంలో ఉందని తెలిసి ఆశ్చర్యం వేసింది. ఒక వస్తువు నిరుపయోగంగా పడి ఉండటమూ పర్యావరణానికి హానికరమే కదా! అనిపించింది. కొత్త ట్రెండ్స్పేరుతో పరుగులు తీస్తున్న ఫ్యాషన్ ప్రపంచం ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. ‘రీ-లవ్’ వల్ల ఇప్పటికిప్పుడే మార్పు రాకపోయినా.. దీర్ఘకాలంలో కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దుస్తుల ఉత్పత్తి విధానాల్లో మార్పులకు ఇది నాంది పలుకుతుందని నమ్ముతున్నా.
- ఫ్యాషన్ ట్రెండ్స్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక మరింత ఎక్కువైంది! ఏది ఎంచుకున్నా నా శరీరానికి నప్పేలా చూసుకుంటాను. అలాగే కాలానికి తగ్గట్టు కనిపించాలనుకుంటాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

