బాలీవుడ్ (Bollywood)లో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది కత్రినాకైఫ్ (Katrina Kaif ). ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం కోస్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal)ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు సింగిల్‌గా ఉన్న ఈ టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ మ్యారేజ్ లైఫ్‌లో ప్రతీ క్షణాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఫొటోనే ఉదాహరణ. కత్రినాకైఫ్ మెడలో ఉన్న ప్రత్యేక ఆభరణం ఒకటి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ ఆభరణం ఏంటనే కదా మీ డౌటు.
పెళ్లయిన తర్వాత మహిళలు అత్యంత పవిత్రంగా భావించే తాళిబొట్టు (Mangalsutra). అవును కత్రినాకైఫ్ మంగళసూత్రంతో కనిపిస్తున్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వెస్టర్న్ క్లాత్ వేర్ లో హ్యాపీ మూడ్‌లో ఉన్న కత్రినాకైఫ్ ఫొటోలో మంగళసూత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. వెడ్డింగ్ తర్వాత హనీమూన్తో బిజీగా ఉండాల్సిన కత్రినాకైఫ్ అలాంటి ప్లాన్స్ ఏం పెట్టుకోకుండా సినిమా షూటింగ్స్ కు వెళ్తున్న భర్తకు సెండాఫ్ ఇస్తూ..ప్రొఫెషనల్ అంటే ఇలా ఉండాలని చెప్పేలా చాలా మంది కోస్టార్స్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది.
కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ 3 సినిమాలో నటిస్తోంది. విక్కీ కౌశల్ హిందీలో గోవిందా నామ్ మేరా, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీతోపాటు మరో మూవీ చేస్తున్నాడు.