Karungaapiyam Movie | హిట్టయిన సినిమాలను రెంట్ ప్రాతిపాదిన పెడితేనే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ఫ్లాప్ సినిమాను కూడా ఓటీటీలో చూడాలంటే డబ్బులు పెట్టాలంటే ఇదేమి విడ్డూరమో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ చేస్తున్న స్టంట్ ఇదే. రెండు నెలల కింద తమిళంలో రిలీజై డిజాస్టర్‌గా నిలిచిన ‘కరుంగాపియం’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. హార్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్, రెజినా ప్రధాన పాత్రలు పోషించారు. కార్తికేయన్ దర్శకత్వం వహించాడు. ఐదు కథల ఆంథాలజీ సినిమాగా రూపొందిన ఈ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిందో ఎవరికి తెలియదు.
కాగా ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే రెంట్ ప్రాతిపదికన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను చూడాలంటే అదనంగా రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. బంపర్ హిట్లయిన సినిమాలకే రెంటల్ పద్దతి వర్కవుట్ కాలేకపోయింది. పొన్నియన్ సెల్వన్ లాంటి పాన్ ఇండియా సినిమాను అద్దె ప్రాతిపదికన పెట్టి చేతులు కాల్చుకుంది ప్రైమ్ సంస్థ. అలాంటిదిప్పుడు అంతకుమించి అన్నట్టు వ్యవహరిస్తుంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమాను కూడా నేరుగా స్ట్రీమింగ్కు పెట్టకుండా, ఇలా రెంట్ ఫిక్స్ చేయడం ఏంటని నెటిజన్లు గుర్రుమంటున్నారు.