ఇటీవల ‘భూల్ భులయ్యా 2’ సూపర్ హిట్‌తో మంచి జోరు మీదున్నారు బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్. ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమను ఆదుకున్న అతి కొద్ది సినిమాల్లో ‘భూల్ భులయ్యా 2’ ఒకటి. ఈ హార్రర్ కామెడీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ వసూళ్లు సాధించింది. ఈ హిట్‌తో కార్తీక్ ఆర్యన్ కొత్త చిత్రాలపైనా ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటున్నది. ఈ యువ హీరో త్వరలో ‘షెహజాదా’ ఆనే చిత్రంతో తెరపైకి రానున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ నాయికగా నటిస్తున్నది. రోహిత్ ధావన్ దర్శకుడు. తెలుగులో ఘన విజయం సాధించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీ రీమేక్‌గా తెరకెక్కుతున్నది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. వాలెంటైన్స్ వీక్‌లో ఈ సినిమా తెరపై సందడి చేయబోతున్నది.