సర్దార్2 సీక్రెట్ ఆపరేషన్
అగ్ర కథానాయకుడు కార్తీ నటించిన ‘సర్దార్' తమిళంతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఆయన నటించిన ‘సర్దార్ 2’ ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నది. ఈ స్పై, యాక్షన్ మిస్టరీ ఎమోషనల్ డ్రామాకు పీఎస్ మిత్రన్ దర్శకుడు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మించారు. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది.
అగ్ర కథానాయకుడు కార్తీ నటించిన ‘సర్దార్’ తమిళంతోపాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఆయన నటించిన ‘సర్దార్ 2’ ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నది. ఈ స్పై, యాక్షన్ మిస్టరీ ఎమోషనల్ డ్రామాకు పీఎస్ మిత్రన్ దర్శకుడు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మించారు. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. రెండు కాలాల్లో జరిగే కథ ఇదని ట్రైలర్ చెబుతున్నది. మురుగన్ భక్తుడైన సర్దార్‌ను జపాన్‌లో జరిగే ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం రిక్రూట్ చేస్తారు. అది సాధారణమైన సీక్రెట్ ఆపరేషన్‌గా మొదలై ఊహించని మలుపు తీసుకుంటుంది. అక్కడ్నుంచి ఏం జరిగింది? ఈ కథలోకి సర్దార్ కొడుకు విజయ్ ఎలా ఎంటరయ్యాడు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.
‘సర్దార్’ని మించే స్థాయిలో ‘సర్దార్ 2’ రూపొందిందని, ఇందులో కార్తీ తండ్రికొడుకులుగా మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని, రెండు పాత్రల్లో ఆయన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయని, ముఖ్యంగా యంగ్ సర్దార్‌గా కార్తీ ట్రాన్స్ఫర్మేషన్ ఆకట్టుకుంటుందని, ఇందులో విలన్ ఎస్.జె.సూర్య అనూహ్యమైన ప్రవర్తన కథలో టెన్షన్ పెంచుతుందని మేకర్స్ తెలిపారు. అశికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ ఉద్వేగభరిత యాక్షన్ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: యువన్‌శంకర్‌రాజా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

