Karthikeya: అట్టహాసంగా కార్తికేయ రిసెప్షన్… వేడుకకు ఎవరెవరు హాజరయ్యారంటే..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో కార్తికేయ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.తను ప్రేమించిన లోహిత మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లోని ఓ కళ్యాణ వేదికలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
గత రాత్రి రిసెప్షన్ వేడుక జరుపుకోగా, ఇండస్ట్రీకి సంబంధించి ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ఆది సాయికుమార్, రాహుల్ రవీంద్రన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది. వరంగల్ నీట్ లో బీటెక్ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందట. ఇప్పుడు తాను మంచి పొజీషన్లో ఉన్న నేపథ్యంలో పెళ్లి చేసుకున్నాడు. కార్తికేయ.. ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు. కానీ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
తన వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం మీద కార్తికేయ రీసెంట్గా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేను పెద్దయ్యాక హీరో నవ్వుతా నా పెళ్ళికి చిరంజీవి వస్తాడు, అని చిన్నప్పుడు అమాయకంగా చెప్పేవాడిని. కానీ తన తల రాత అదే అయ్యి తన పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవిని టాగ్ చేస్తూ మీరు నా పెళ్ళికి రావడం చాలా గొప్ప విషయం, ఇది నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే విషయం అని కార్తికేయ ఆనందం వ్యక్తం చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

