అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో చిత్రం హిందీలో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షెహ్జాదా (Shehzada) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిసనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన షెహ్జాదా టీజర్ (Shehzada Teaser) నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే కార్తీక్ ఆర్యన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి ఇపుడు బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాడట కార్తీక్ ఆర్యన్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాదు కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదని ఇన్సైడ్ టాక్. ఈ అప్డేట్ పై కార్తీక్ ఆర్యన్ ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి మరి.
రోహిత్ ధవన్ దర్శకత్వం వహిస్తున్న షెహ్‌జాదాలో పరేశ్ రావల్, మనీషా కొయిరాలా, సచిన్ ఖేడ్కర్, రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ & టీ సిరీస్, అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్ ఫిలిమ్స్, అల్లు ఎంటర్టైన్మెంట్, బ్రాట్ ఫిలిమ్స్, హారికాఅండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
షెహ్జాదా టీజర్.. వీడియో