ఇటీవల విడుదలైన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవడానికి కొందరు చేసిన ట్రోల్స్ కారణమని చిత్ర కథానాయిక కరీనాకపూర్ ఆరోపించింది. ఆమె మాట్లాడుతూ ‘కేవలం ఒక్కశాతం ప్రేక్షకులే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. విడుదలకు ముందే ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ దుష్ప్రచారం చేశారు. ఆ వ్యతిరేక ప్రచారం వల్లే ఓపెనింగ్స్ తగ్గాయి. ఈ చిత్రాన్ని బహిష్కరిస్తే మంచి సినిమాను దూరం చేసినవారవుతారు. దీని కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం. తప్పకుండా థియేటర్లలో సినిమా చూసి ఆస్వాదించండి’ అని కరీనాకపూర్ పేర్కొంది.