బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.వీరి వైవాహిక జీవితంలో తైమూర్, జెహ్ అనే ఇద్దరు చిన్నారులు ఉండగా, వారితో ఆనందకరమైన జీవితం గడుపుతున్నారు. జెహ్ని రీసెంట్గా సారా అలీ ఖాన్ ప్రపంచానికి పరిచయం చేయగా, ఈ బుడతడి పిక్ తెగ వైరల్‌గా మారింది.
తాజాగా కరీనా కపూర్ తన చిన్న కుమారుడు వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న విషయాన్ని స్వయంగా వెల్లడించింది. లాల్ సింగ్ చద్ధా సినిమాలో ఓ పాటలో రెండో కుమారుడు ’జెహ్’ కనిపించనున్నాడట. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఓ రొమాంటిక్ పాటలో కనిపించనున్నాడు, అలానే పలు సీన్స్‌లలో తన కుమారుడు కనిపిస్తాడని కరీనా మీడియాకు వెల్లడించింది. ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటించారు.
కరీనా, సైఫ్‌ల పిల్లల పేర్లు ఎంత వివాదం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి అబ్బాయి పేరు తైమూర్ అలీ ఖాన్ అని పెట్టగా, అప్పట్లో తైమూర్ పేరుపై పెద్ద వివాదమే చెలరేగింది. ఇక రెండో అబ్బాయికి ముందు జహాంగీర్ అలీ ఖాన్ అనే పేరు పెట్టారు. దీనిపై వివాదం చెలరేగడంతో జెహ్ అని మార్చారు. జెహ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించిన విషయం తెలిసిందే.