Kannappa Movie | మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా ప్రీమియర్స్ వేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను చిత్రబృందం ఖండించింది. ఈ సందర్భంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్ జరిగిందని ఆన్లైన్ వేదికలపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేము వీఎఫ్ఎక్స్ విభాగానికి చెందిన 15 నిమిషాల ఫుటేజ్ నాణ్యతను మాత్రమే పరిశీలించాము. ‘కన్నప్ప’ సినిమా ఫస్ట్ కాపీని సిద్ధం చేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రం విస్తృతమైన వీఎఫ్ఎక్స్ పనులను కలిగి ఉండటం వల్ల, ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తుండటంతో కొంత అదనపు సమయం అవసరమవుతోంది. అభిమానులు, మీడియా సభ్యులు ధృవీకరించని వార్తలను, సమాచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాము. పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తాము. ‘కన్నప్ప’ టీమ్ కృషిని అర్థం చేసుకుని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ కన్నప్ప టీమ్ రాసుకోచ్చింది.
మరోవైపు ఈ సినిమాను మొదటగా ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మూవీని వాయిదా వేసినట్లు మంచు విష్ణు వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ ఆలస్యం అవుతుండడంతో ఈ మూవీని వాయిదా వేసినట్లు విష్ణు ప్రకటించాడు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు.
Official Clarification from Team Kannappa
Contrary to rumours spreading online, there was NO premiere or screening of the full movie yesterday. The Kannappa team only reviewed a 15-minute VFX segment for quality assessment and corrections.
The film’s first cut is still under…
— Kannappa The Movie (@kannappamovie) April 1, 2025