Producer | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రముఖ సినీ నిర్మాత (Kannada producer) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం తన నివాసంలో శవమై కనిపించాడు.
ప్రముఖ కన్నడ సినీ నిర్మాత (Kannada producer) సౌందర్య జగదీశ్ (Soundarya Jagadish).. ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో (Bengaluru home) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన రాజాజీనగర్ (Rajajinagar)లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్మాతను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిర్మాత మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగదీష్ ‘అప్పు పప్పు’, ‘స్నేహితారు’, ‘రామ్లీల’, ‘మస్త్ మజా మాది’ వంటి అనేక చిత్రాలను నిర్మించి గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు.. జగదీష్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Salman Khan | సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే..!
Ram Navami | రామనవమికి ముస్తాబవుతున్న అయోధ్యానగరి.. వేడుకలకు 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
Kota Hostel | కోటా హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థులకు గాయాలు