Kangana: కోర్టులపై నమ్మకం పోయిందని కామెంట్ చేసిన కంగనా

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా రనౌత్.. తాజాగా కోర్టు పని తీరుని తప్పు పట్టింది. కోర్టు కూడా బెదిరిస్తుందని, దానిపై నమ్మకం పొయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సుశాంత్ సింగ్ మరణించిన సమయంలో నెపోటిజంపై కంగనా తీవ్ర విమర్శలు చేసింది. హృతిక్ రోషన్, రైటర్ జావెద్ అక్తర్లను ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ చాలా బలంగా నాటుకుపోయింది’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై రైటర్ జావెద్ అక్తర్ కంగనా రనౌత్పై పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసుకి సంబంధించి హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. ఎట్టకేలకు కంగనా హాజరైంది. బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకుండా కోర్టుకి హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని పరోక్షంగా కోర్టు రెండు సార్లు తనను బెదిరించిందని తెలిపారు కంగనా.
ఈ కేసు దర్యాప్తు తనకు వ్యతిరేఖంగా సాగుతుందని చెప్పిన కంగనా, ఈ కేసుని మరోకోర్టుకి బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు రిక్వెస్ట్ చేశారు. ఈ దరఖాస్తును అక్టోబర్ 1న కోర్టు పరిశీలించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

