సుప్రీం యాస్కిన్ బీభత్సకాండ సెకండ్‌పార్ట్‌లో
‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారిన పాత్ర ‘సుప్రీం యాస్కిన్'. రెండొందల ఏళ్ల రాక్షసుడు యాస్కిన్‌గా కమల్‌హాసన్ ఒదిగిపోయి నటించారు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసిన ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారిన పాత్ర ‘సుప్రీం యాస్కిన్’. రెండొందల ఏళ్ల రాక్షసుడు యాస్కిన్‌గా కమల్‌హాసన్ ఒదిగిపోయి నటించారు. నమ్మశక్యం కాని ఆయన రూపం ప్రేక్షకుల్లో చర్చకు దారితీసింది. దర్శకుడు నాగ్అశ్విన్ ఒకే సెట్లో గ్రీన్‌మ్యాట్ వేసి కమల్ సీన్స్ అన్నీ తీసేశాడు. సకలకళా వల్లభుడైన కమల్.. విలన్‌గా కూడా విశ్వరూపం చూపించేశాడు.
రీసెంట్గా ఈ సినిమాను ఆయన చెన్నయ్‌లో తిలకించారు. ఆ తర్వాత తన పాత్ర గురించి ప్రత్యేకంగా మీడియాతో ముచ్చటించారు. ‘ ‘కల్కి’ రెండవభాగంలో నా పాత్ర అధికంగా ఉంటుంది. ఈ పాత్రను అంగీకరించడానికి ఏడాది పాటు ఆలోచించా. అసలు ఈ పాత్ర చేయగలనా అనే సందేహం కూడా కలిగింది.
దర్శకుడు నాగీకి సహనం ఎక్కువ. అందరితో అద్భుతంగా చేయించుకున్నాడు. పురాణాలకు సైన్స్‌ని ముడిపెట్టి తెరపై ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఎంత ఓపిగ్గా కథ రాసుకున్నాడో అంతే ఓపిగ్గా తెరకెక్కించాడు. దాని ప్రతిఫలమే ఈ విజయం. సుప్రీం యాస్కిన్ బీభత్సకాండను సెకండ్ పార్ట్‌లో చూస్తారు’ అన్నారు కమల్‌హాసన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

