Patas-2 |వరుస ఫ్లాప్‌లలో ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు పటాస్ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే చిత్రం తర్వాత ఆ స్థాయి హిట్‌ను పటాస్ తెచ్చిపెట్టింది. అనీల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది. మళ్లీ వీళ్ల కాంబోలో సినిమా ఎప్పుడస్తుందంటూ ప్రేక్షకుల ఎదరుచూస్తున్నారు. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం వీళ్లిద్దరి కాంబోలో సినిమా రానున్నట్లు తెలుస్తుంది.
తాజాగా అనీల్ రావిపూడి ఓ ఇంటర్వూలో కళ్యాణ్ రామ్ పటాస్-2 కచ్చితంగా ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3 లేటెస్ట్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని మే 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీని తర్వాత అనీల్ రావిపూడి బాలయ్య బాబుతో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను డెవలప్ చేసు పనిలో ఉన్నాడు. బాలయ్య బాబు చిత్రం తర్వాతే కళ్యాణ్ రామ్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసర, డెవిల్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.