మెగా కాంపౌండ్ హీరో కల్యాణ్ దేవ్ (Kalyaan Dhev) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కిన్నెరసాని (Kinnerasani). ఈ మూవీ టీజర్ ను యువ నటుడు నితిని విడుదల చేశాడు. మీ పాప ఒక అద్బుతం పార్వతి గారు. కానీ అద్బుతం జరిగే ప్రతీ చోట ఆపదలుంటాయి..అనే సంభాషణలతో మొదలైన టీజర్ సస్పెన్స్ గా సాగుతుంది. కల్యాణ్ దేవ్ చేతిలో కిన్నెరసాని పుస్తకాన్ని పట్టుకొని ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా..ప్రేమకైనా అంటూ చెప్తున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
కిన్నెరసాని చిత్రంలో అన్ శీతల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. అన్ శీతల్ టీజర్ లో ఎలాంటి మాటలు లేకుండా కనిపిస్తూ..తన లుక్తో ఆకట్టుకుంటోంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తుంది. ఈ చిత్రానికి దినేశ్ కే బాబు కెమెరా వర్క్ చేస్తున్నాడు.
రమణతేజ (Ramana Teja) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దేశరాజ్ కథనందించాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో కల్యాణ్ దేవ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్